![]() |
![]() |

జబర్దస్త్ షో ఆడియన్స్ ని ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో స్పెషల్ అట్రాక్షన్ గా నూకరాజు స్కిట్ నిలిచింది. ఇందులో నూకరాజు ఒక మేల్ యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూ స్కిట్ వేసాడు. ముందుగా ఇంద్రజ డూప్ లా నాటీ నరేష్ వచ్చేసరికి "మీ వల్ల జబర్దస్త్ లో ఒక మేనేజర్ ని జాబ్ లోంచి తీసేశారంటా నిజమా కాదా ? " "నో అండి నేనెప్పుడూ ఎవరి పొట్టా కొట్టనండి" అని చెప్పాడు. "మీకు షుగర్ ఉంది" అని నూకరాజు అడిగేసరికి "నువ్వు నీ హద్దులు దాటేస్తున్నావ్" అన్నాడు నరేష్. "మీ నోట్లోంచి వచ్చే మాటలు ఎంత తియ్యగా ఉన్నాయో మీకు తెలుసా.. ఆ మాటలు తియ్యగా ఉంటే మరి షుగర్ ఉన్నట్టా లేనట్టా"అని నూకరాజు అడిగేసరికి "షుగర్ ఉంది, షుగర్ ఉంది" అన్నాడు నాటీ నరేష్. తర్వాత రాకెట్ రాఘవను పిలిచి ఇంటర్వ్యూ చేసాడు. "జబర్దస్త్ లో రోజా గారి నవ్వు బాగుంటుందా, ఇంద్రజ గారి నవ్వు బాగుంటుందా.." అని అడిగాడు.
" రోజా గారి నవ్వు బాలేదంటే వాళ్ల గన్ మ్యాన్ చంపేస్తాడు, ఇంద్రజ గారి నవ్వు బాలేదంటే ఆవిడ గంట గంటకు చంపేస్తారు...ఇద్దరి నవ్వు బాగుంటుంది. " అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫైనల్ గా తన్మయ్ ని పిలిచాడు నూకరాజు.."కృష్ణ భగవాన్ గారు అర్ధరాత్రి ఒంటి గంటకు గురక పెడతారంట నిజమా కాదా" అని అడిగేసరికి " ఆయన ప్రశాంతంగా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా పడుకుంటారు" అని చెప్పింది తన్మయ్. ఇలా నూకరాజు నత్తినత్తిగా ఒక యాంకర్ ని ఇమిటేట్ చేస్తూ ఒక స్కిట్ వేసాడు. "ఇలా ఎవరు ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ల పేరు ధైర్యంగా చెప్పు" అని కృష్ణ భగవాన్ అనేసరికి ఎవరు లేరు అని ఆ యాంకర్ పేరు చెప్పకుండా తప్పించుకున్నాడు నూకరాజు.
![]() |
![]() |